
చెన్నై న్యూస్: వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని చెన్నై రాయపేట, వైఎంసిఏ గ్రౌండ్ లో ఏర్పాటైన ‘కాటన్ అండ్ సిల్క్ ఫ్యాబ్ 2026’ ప్రదర్శనకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100 మందికి పైగా చేనేత, హస్త కళాకారులు పాల్గొన్నారు. ఇక్కడ సంప్రదాయ వస్త్రాలతో పాటు సిల్క్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, కుర్తాలు, దుపట్టాలు ఎన్నో ప్రదర్శనకు ఉంచారు. ఇవన్నీ యువతులను, మహిళలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ప్రదర్శనలో సంబల్పురి ఇక్కత్ సిల్క్ చీరలు, బీహార్ కు చెందిన ఒరాగ్నిక్ టాస్సార్ సిల్క్ చీరలు, సూట్ అండ్ స్టోల్స్, అస్సాం ముగా మరియు ఏరి సిల్క్ చీరలు, కర్ణాటక క్రేప్ సిల్క్, జార్జెట్ సిల్క్, అరణి సిల్క్, ప్రింటెడ్ చీరలు, తమిళనాడు కాంచీపురం, ప్రింటెడ్ చీరలు, సిల్క్ చీరలు, డిజైనర్ ఫ్యాన్సీ చీరలు, గద్వాల్, మంగళగిరి, పోచంపల్లి చీరలు, ఉత్తరప్రదేశ్ మల్బరీ సిల్క్, జమ్దానీ, జమవార్ సిల్క్ చీరలు, చిఫాన్ సిల్క్, మహారాష్ట్ర డిజైనర్ డ్రెస్ మెటీరియల్స్, ఛత్తీస్గఢ్ ఎక్స్క్లూజివ్ రా సిల్క్ చీరలు, కోసా సిల్క్, టస్సర్ సూట్ అండ్ దుప్పట్టా, మధ్యప్రదేశ్ మహేశ్వరి, పశ్చిమ బెంగాల్, చందేరి మాస్లీ, గిచా చీరలు, బోటిక్ చీరలు, కాంత చీరలు, జోర్దోషి, జమ్ము, కాశ్మీర్ చినాన్ సిల్క్, టాడీ సిల్క్ ప్రింటెడ్ చీరలు, పష్మినా శాలువలు, సూట్లు, రాజస్థాన్ కోటా సిల్క్, హ్యాండ్ బ్లాక్ ప్రింట్ డ్రెస్సులు, చీరలు, పంజాబ్ ఫుల్కారీ డ్రెస్సులు మరియు మరెన్నో ఉన్నాయి. ఇక్కడ నేరుగా చేనేత కార్మికుల నుంచే విక్రయాలు జరగడం వల్ల ధరలు కూడా సాధారణ మార్కెట్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఉంటుందని, ఈనెల 26వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.



