ఆకట్టుకుంటున్న ‘కళా ఉత్సవం’ చేనేత, హస్తకళా ప్రదర్శన

చెన్నై న్యూస్: నగరంలో ఏర్పాటయిన చేనేత, హస్తకళా ప్రదర్శన ‘కళా ఉత్సవం’
సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. దీనికి ఓల్డ్ పల్లావరం, పెరుమాళ్ నగర్ లోని 200 ఫీట్ రేడియల్ రోడ్డులోని మురుగన్ టవర్స్ (ఏసి హాలు) వేదికగా నిలిచింది. ఇందులో క్రాఫ్ట్స్, టెక్స్ టైల్స్ తో పాటు హోమ్ డెకార్, జ్యువెలరీ, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన చీరలు.. భాగల్పూరి, చందేరి, బెంగాల్ కాటన్, కంచి కాటన్, హుబ్లీ కాటన్, చెట్టినాడు కాటన్, లడక్ సిల్క్, కాశ్మీరీ సిల్క్, పోచంపల్లి చీరల రకాలు ఉన్నాయి. అలాగే, కాటన్ టాప్స్, హ్యాండ్ వర్క్ టాప్స్, సల్వార్ సూట్లు ప్రదర్శనకు ఉంచారు. అంతే కాకుండా, గృహాలంకరణ కోసం ఎర్రకోట వస్తువులు, ఉడెన్ క్రాఫ్ట్ ఐటమ్స్, సిరామిక్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, కర్టన్ ఐటమ్స్, బెడ్ షీట్లు, సోఫా సెట్ కవర్లు, ఫర్నిచర్ ఐటమ్స్, కిడ్స్ వేర్, కిడ్స్ ప్లే ఐటమ్స్, జువెలరీ రకాలు, ఇత్తడి కళారూపాలు ఉన్నాయి. ఈ ప్రదర్శన ఉదయం 11:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు ఉంటుందని, ఎంట్రీ, పార్కింగ్ ఉచితమని నిర్వాహకులు తెలిపారు. ఈనెల 16వ తేదీ వరకు ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు.