కనువిందు చేస్తున్న చేనేత, హస్తకళా ప్రదర్శన

చెన్నై న్యూస్: నగరంలో ‘కళాకృతి సంత’ పేరిట శుక్రవారం ఏర్పాటైన చేనేత, హస్తకళా ప్రదర్శన సందర్శకులకు కనువిందు చేస్తున్నది. దీనికి ఆళ్వారు పేటలోని టిటికె రోడ్డులో గల శ్రీ శంకరా హాలు వేదికగా నిలిచింది. భారత దేశంలోని హస్తకళాకారులందరి ఉత్పత్తులను ఒక వేదిక పైకి తీసుకువచ్చే విధంగా ఈ ప్రదర్శన ఏర్పాటయింది. ఇందులో చేనేత వస్త్రాలు, హస్తకళ ఉత్పత్తులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వీటిలో చందేరీ చీరలు, మహేశ్వరి చీరలు, కాంత వర్క్ సారీస్, బోటిక్ సారీస్ జీన్స్ కాంతా వర్క్, బోటిక్ బ్యాగ్స్, చుడీదార్ మెటీరియల్ గుజరాత్ స్కర్ట్స్, ప్యాంట్స్, అనార్కలీ టాప్స్, కాశ్మీర్ సిల్క్ చీరలు, కిడ్స్ మరియు మదర్స్ గుప్తాన్, హజరక్ కలంకారి ముల్ముల్ కాటన్, బ్లాక్ ప్రింట్, షార్ట్ టాప్, లాంగ్ టాప్ అనార్కలి డ్రెస్సెస్, గ్రోలి చిల్డ్రన్ దోతీ, కుర్తాస్ హ్యాండ్లూమ్, కార్డు సెట్ డ్రెస్, ధోతి సెట్, నైటీస్, రాజస్థాన్ పెయింటింగ్స్, తంజావూరు పెయింటింగ్‌లు, ఒడిస్సా పట చిత్ర పెయింటింగులు, సాండ్ ఆర్ట్ పెయింటింగ్స్, ఇత్తడి కళారూపాలు, ఫ్యాన్సీ జువెలరీ, స్పిరిచువల్ స్టాచ్యూస్, ఆక్సిడైజ్డ్ జ్యువలరీ, స్టోన్ జువెలరీ సహా మరెన్నో హస్తకళా వస్తువులు ఉన్నాయి.
ఈ ప్రదర్శన ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 9:30 గంటల వరకు ఉంటుందని, సెప్టెంబరు నెల 14వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే ఎంట్రీ ఫీజు, పార్కింగ్ వసతి ఉచితమని తెలిపారు.